పవన్ రెమ్యునరేషన్ పై ఓ రేంజ్ లో రచ్చ.!

Published on Apr 23, 2021 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఓవర్సీస్ లో కానీ ఉన్న స్టార్డం కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాను ఓ సినిమా చేసే సింపుల్ గా ఓ భారీ సినిమాకు అయ్యే బడ్జెట్ ను ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉంటారు. అయితే దేనికి అయినా ఓ పరిధి ఉంటుంది అలా ఇప్పుడు పవన్ మార్కెట్ పరంగా నిర్మాతలు 50 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన టాక్.

అయితే ఆ మధ్యన పవన్ “అయ్యప్పణం కోషియం” రీమేక్ కు గాను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వచ్చిన గాసిప్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. అంతే కాకుండా షూట్ ఉన్న ప్రతీ రోజు ఒక్కో కోటి రెమ్యునరేషన్ అలా ఎన్ని రోజులు పవన్ కి షూట్ ఉంటే అన్ని కోట్లు అన్నట్టుగా కూడా ఆనాడే టాక్స్ పవన్ రెమ్యునరేషన్ పరంగా వినిపించాయి.

ఇప్పుడు ఆశ్చర్యకరంగా “వకీల్ సాబ్” సినిమాకు గాను పవన్ కు మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ ముట్టింది అని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ కు ఇచ్చిన 50 కోట్లు కాకుండా లాభాల్లో మరో 15 కోట్లు ఇలా మొత్తం 65 కోట్లు పవన్ కు దక్కింది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజమో ఎవరికీ తెలీదు జస్ట్ రూమర్ మాత్రమే అనుకోవాలి.

ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు లాభాలు వచ్చాయి అని ఎక్కడా అఫీషియల్ గా తెలిసింది లేదు అలాగే నష్టాలు వచ్చాయి అని కూడా టాక్ లేదు. ఏది పడితే అది వైరల్ అవుతుంది అంతే అనుకోవాలి తప్పితే అసలు నిజం ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. ఇలా మొత్తానికి మాత్రం ఇపుడు పవన్ వకీల్ సాబ్ కు ఈ భారీ మొత్తం రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :