పవన్ బర్త్ డే కానుకగా మాస్ సింగిల్..?

Published on Aug 10, 2021 10:00 am IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న క్రేజీ చిత్రాల్లో అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి.. అలాగే ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా నటిస్తుండడంతో మన టాలీవుడ్ నుంచి రానున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో ఇదొకటిగా మారింది. ఇక ఎప్పటికప్పుడు అదిరే అప్డేట్స్ తో అలరిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ ఇటీవలే అప్డేట్ కూడా ఇచ్చారు. మరి ఈ పవర్ ఫుల్ మాస్ నెంబర్ ని మేకర్స్ పవన్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేయనున్నట్టు టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇప్పటికే థమన్ ఎలెక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ ని ఇచ్చాడు.. దీనితో ఈ మాస్ సింగిల్ ఎలా ఉంటుందా అని హైప్ మొదలయ్యింది. మరి దీనిని వచ్చే సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.. అయితే ఇది కూడా రీమేక్ సినిమా అయ్యినప్పటికీ పవన్ నుంచి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ఇది కావడంతో మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :