పవన్ స్వాగ్ తో “భగత్ సింగ్” నుంచి అద్దిరిపోయిన పోస్టర్.!

Published on May 11, 2023 1:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఒకటైన పవర్ ఫుల్ మాస్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈరోజు సాలిడ్ గ్లింప్స్ ని రిలీజ్ చేయనుండగా దీనిపై స్కై హై హైప్ అయితే నెలకొంది. ఇక ఈ హైప్ లోనే మేకర్స్ అయితే ఓ సాలిడ్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. నిన్న చిన్న ప్రీ లుక్ లాంటి పోస్టర్ ని రిలీజ్ చేయగా ఇపుడు దీని ఫుల్ పోస్టర్ అయితే బయటకి వచ్చింది.

మరి ఈ పోస్టర్ అయితే పవన్ ఫ్యాన్స్ కి అదిరే ట్రీట్ ని ఇచ్చేలా ఉందని చెప్పాలి. పవన్ తన మార్క్ సూపర్ స్వాగ్ తో అయితే ఇందులో కనిపిస్తున్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో అనేకమంది ముస్లిం లు వారి ముందు బ్యారికేడ్ దగ్గర నుంచొని ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టుగా పవన్ కనిపిస్తున్నాడు. దీనితో ఈ పోస్టర్ అయితే గ్లింప్స్ వచ్చే ముందు సాలిడ్ బ్లాస్ట్ లా మారింది అని చెప్పాలి. ఇక ఈ సాయంత్రం వచ్చే వీడియో అయితే ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :