పవన్ సాలిడ్ రీమేక్ అప్పటికి షిఫ్ట్ కానుందా.?

Published on Jun 24, 2021 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ప్రాజెక్ట్స్ లో మళయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు 40 శాతం మేర షూట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మళ్ళీ జూలై నెలలో పట్టాలెక్కనుంది.

ఇక ఇదిలా ఉండగా నిజానికి ఈ సినిమాని పరిస్థితులు బాగుంటే ఈ ఏడాదిలోనే మేకర్స్ విడుదల చేసేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేకపోవడంతో ఈ చిత్రం వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవ్వనున్నట్టు సినీ వర్గాలలో టాక్. మరి వచ్చే ఏడాదిలో ఎప్పుడు అంటే సంక్రాంతి రేస్ లోనే ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరి దీనిపై క్లారిటీ ఏమన్నా వస్తుందేమో కూడా చూడాలి. ఇక ఈ సాలిడ్ రీమేక్ కి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :