పవన్ “వీరమల్లు” అబ్బురపరుస్తుందట.!

Published on May 19, 2021 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు భారీ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రంపై అంతే స్థాయి అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం ఓ అద్భుతమైన పీరియాడిక్ నేపథ్యం లోనిది అని అందరికీ తెలిసిందే.

మరి అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం విడుదల అయ్యాక ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తుందట. దీనికి కారణం ఈ సినిమాలో కనిపించబోయే గ్రేట్ విజువల్స్ అని కూడా తెలుస్తుంది. అంతే కాకుండా పలు కీలక ఎపిసోడ్స్ కూడా మూవీ లవర్స్ కి మంచి ఫీస్ట్ ను ఇవ్వనున్నట్టుగా టాక్.

అలాగే ప్రధానంగా అయితే కథా పరంగా కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయట. మరి క్రిష్ పవన్ తో ఎలాంటి ట్రీట్ సన్నద్ధం చేస్తున్నారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టక తప్పదు. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :