
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ‘పవర్’ సినిమాతో మెప్పించిన దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో హైలైట్‌గా కనిపిస్తూ వస్తోన్న సినిమా. అత్తారింటికి దారేది తర్వాత చాలా కాలానికి పవన్ చేస్తోన్న సినిమా కావడం, సూపర్ హిట్ గబ్బర్ సింగ్ క్యారెక్టరైజేషన్‌ను బేస్ చేసుకొని రూపొందిన కథ కావడం, ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌తో అంచనాలను విపరీతంగా పెంచేయడం వంటి కారణాలు సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
శరత్ మరార్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాను వేసవి సీజన్‌లో ఏప్రిల్ మొదటివారంలో విడుదల చేయాలని గత కొద్దిరోజులుగా ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా అదే నెలలో సూపర్ స్టార్ మహేష్ ‘బ్రహ్మోత్సవం’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు’ లాంటి సినిమాలు విడుదలకు ముందే సిద్ధమవ్వడంతో సర్దార్ టీమ్ మార్చి నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేశేలా మరింత పకడ్బందీగా సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా ట్రెండ్ సృష్టించింది. ఇక టాప్ స్టార్స్ అయిన పవన్, మహేష్, అల్లు అర్జున్ ఒకే నెల గ్యాప్‌లో థియేటర్లకు వచ్చేయనుండడం ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం.

