ఫ్యాన్ ప్రొడ్యూసర్ తో పవన్ మరో సినిమా.?

Published on Apr 24, 2021 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత అభిమాన ఆదరణ ఉందో తెలిసిందే. మరి అలాగే తెలుగు సినీ పరిశ్రమలో కూడా చాలా మేర కళ్యాణ్ కు అభిమానులు ఉన్నారు. నటీనటులలోనే కాకుండా నిర్మాత, టెక్నీషియన్స్, దర్శకులలో కూడా చాలా మందే ఉన్నారు.

మరి అలా వారి కలయికలో వచ్చిన లేటెస్ట్ సినిమానే “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు, సంగీతం ఇచ్చిన థమన్ ఈ సినిమాకు తమ సిసలైన ఫ్యానిజం చూపించారు. దిల్ రాజు అయితే పవన్ తో సినిమా చెయ్యడం డ్రీం అని ఎప్పటి నుంచో చెప్తూ వచ్చి ప్రీ రిలీజ్ లో తన ఆనందం కూడా వ్యక్తం చేశారు.

మరి అలాంటి ఫ్యాన్ ప్రొడ్యూసర్ కి పవన్ మళ్ళీ అవకాశం ఇచ్చారా అంటే ఇండస్ట్రీలో అవుననే మాటే వినిపిస్తుంది. ఆల్రెడీ పవన్ దిల్ రాజుకి మరో సినిమాకు ఓకే చెప్పారని దిల్ రాజు ఆ సినిమా కోసం దర్శకుణ్ణి సిన్సియర్ గా వెతికేస్తున్నారని ఇప్పుడు లేటెస్ట్ గాసిప్. మరి ఇది ఎంత వరకు నిజమో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :