ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితిని ఏర్పాటు చేస్తాం – పవన్

ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితిని ఏర్పాటు చేస్తాం – పవన్

Published on Apr 23, 2018 10:47 AM IST


గత కొన్ని రోజులుగా తెలుగు పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యహారం సంచనలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడ తనపై ఆర్జీవి, శ్రీరెడ్డిల శ్రీరెడ్డిల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పోరాటానికి దిగడంతో ఈ విషయం మరింత తీవ్ర రూపం దాల్చింది. కావాలనే కొన్ని మీడియా ఛానెళ్ళు తనపై అనవసరమైన విమర్శలు చేస్తున్నాయని పవన్ రెండు మూడు రోజులుగా ట్విట్టర్ ద్వారా పలువురు మీడియా పెద్దల్ని ఉద్దేశించి ట్వీట్లు చేస్తున్నారు.

వాటిలో భాగంగానే కొద్దిసేపటి క్రితం పరిశ్రమకు ముప్పుగా మారిన కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా, నటీమణులకు అండగా ‘తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి’ని ఏర్పాటు చేస్తున్నట్టు పవన్ తెలిపారు. అంతేగాక వారికి జనసేన వీరమహిళా విభాగం అండగా ఉంటుందని కూడ అన్నారు. ఈ పోరాట సమితి ఎప్పుడు ప్రారంభమవుతుంది, దాని విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా పనిచేస్తుంది అనే వివరాలను కూడా ఆయన త్వరగా ప్రకటిస్తే బాగుంటుంది.

తాజా వార్తలు