పవన్ – త్రివిక్రమ్ ల మూవీ అప్డేట్ !


పవన్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ నిన్ననే మొదలైంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఒక ప్రత్యేక కాఫీ షాప్ సెట్లో చిత్రీకరణ స్టార్ చేశారు. ఇందులో పవన్, అను ఇమ్మాన్యుయేల్ ల మీద మొదటి షాట్ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ సుమారు నెల రోజులు పాటు హైదరాబాద్లోనే జరగనుంది. కాగా మొదటి హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ వారంలోనే షూట్లో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి.

హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పవన్ మునుపెన్నడూ లేని విధంగా సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ లుక్ లో కనిపించనున్నాడు. పవన్-త్రివిక్రమ్ ల కలయికలో గతంలో వచ్చిన ‘జల్సా, అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలు మంచి హిట్లు కావడంతో ఈ సినిమాపై కూడా తారా స్థాయి అంచనాలున్నాయి. అనిరుద్ సంగీతం అందివ్వనున్న ఈ సినిమాను ఆగష్టు నెల కల్లా పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు త్రివిక్రమ్. ఇకపోతే ఈ చిత్రంలో అలనాటి స్టార్ హీరోయిన్ కుష్బు ఒక కీలక పాత్రలో నటించనుండటం విశేషం.