‘కాటమరాయుడు’ ఫైనల్ లుక్ ఇదేనా..!?

pk

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. చాలా నెలల క్రితమే అనౌన్స్ అయిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోన్న సినిమా, డిసెంబర్ నెలాఖరుకల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంటుందట. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, పంచెకట్టుతో కనిపించడంతో పాటు, మీసకట్టును కూడా కొత్తగా కనిపించేలా ప్లాన్ చేశారట.

నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నపుడు ఉన్న మీసకట్టునే కాటమరాయుడు సినిమాలో లుక్‌గా ప్రచారం చేస్తున్నారు. చేతికి పెట్టుకున్న పెద్ద ఉంగరం కూడా సినిమాలో రోల్ కోసమేనని తెలుస్తోంది. నేరుగా షూటింగ్ స్పాట్ నుంచి వచ్చి పవన్ జనసేన్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారని వినిపిస్తోంది. దీంతో కాటమరాయుడులో పవన్ ఫైనల్ లుక్ ఇదే అయి ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహిస్తున్నారు.