డిస్కో రాజా విజయం ఆ హీరోయిన్ కి చాలా అవసరం.

Published on Dec 6, 2019 7:36 am IST

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఆమెది నెగెటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ క్యారెక్టర్ కావడంతో అమ్మడుకి అవకాశాలు అంతగా రాలేదు. ఇక ఇటీవల ఆర్ డి ఎక్స్ 100అంటూ మరో మారు హాట్ నెస్ తో హీట్ రేపారు. ఆ చిత్రం పరాజయం కావడంతో ఆమె నిరాశకు గురయ్యారు.

దీనితో ఆమె రవితేజ సరసన నటిస్తున్న డిస్కో రాజా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడం చాలా అవసరం. లేకుంటే పాయల్ కు ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ లు తగ్గే అవకాశం కలదు. ఆమె వెంకీ మామ చిత్రంలో కూడా నటించినప్పటికీ ప్రధాన హీరోయిన్ కాదు. అలాగే ఆమె పాత్రకు అంతా ప్రాధాన్యత కానీ, ఎక్కువ నిడివి కానీ ఉండే అవకాశం లేదు. ఆ చిత్రం విజయం సాధించినప్పటికీ ఆమెకు ఎటువంటి క్రెడిట్ దక్కదు. కాబట్టి డిస్కో రాజా హిట్ అవడం పాయల్ కెరీర్ కి చాలా అవసరం.

సంబంధిత సమాచారం :

X
More