ఫ్యాన్స్‌కు పాయల్ రాజ్‌పుల్ బంపర్ ఆఫర్.. అది ఎక్స్‌పెక్ట్ చేయొద్దంటూ క్లారిటీ..!

ఫ్యాన్స్‌కు పాయల్ రాజ్‌పుల్ బంపర్ ఆఫర్.. అది ఎక్స్‌పెక్ట్ చేయొద్దంటూ క్లారిటీ..!

Published on Jul 9, 2026 4:31 PM IST

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ప్రేక్షకుల్లో పాపులారిటీ సంపాధించిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఆపై పలు చిత్రాల్లో నటించి తన సత్తా చాటుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. అయితే, ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్తగా ఆమె సబ్‌స్క్రిప్షన్ ఛానల్ ఫీచర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పెయిడ్ ఫీచర్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఆమె సబ్‌స్క్రైబర్లు ఆమె గ్లామరస్ ఫోటోలు, వీడియోలు, బోల్డ్ కంటెంట్ ఉంటుందని ఆశిస్తూ వచ్చారు.

కానీ, వారందరికీ పాయల్ ఝలక్ ఇచ్చింది. తన ఛానల్ నుండి కేవలం హాట్ పిక్చర్స్ లేదా బోల్డ్ కంటెంట్ ఆశించే వారు దయచేసి సబ్‌స్క్రైబ్ చేసుకోవద్దని ఆమె స్పష్టం చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ కేవలం షూటింగ్ లొకేషన్స్ లోని బిహైండ్ ది సీన్స్ విశేషాలు, తన పర్సనల్ అప్‌డేట్స్ మరియు తన రియల్ లైఫ్‌ను ఫ్యాన్స్‌కు మరింత దగ్గరగా చూపించడం కోసమేనని ఆమె తెలిపింది.

దీంతో పాయన్ నుంచి హాట్ గ్లామర్ ట్రీట్ ఎక్స్‌పెక్ట్ చేసిన వారికి నిరాశే మిగిలింది. ఇక కెరీర్ విషయానికొస్తే, పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తెలుగులో ‘కిరాతక’ అనే చిత్రంలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు