వెంకీమామ లో సెన్సేషనల్ హీరోయిన్ !

వెంకీమామ లో సెన్సేషనల్ హీరోయిన్ !

Published on Feb 17, 2019 9:26 AM IST


విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య ల మల్టీ స్టారర్ ‘వెంకీమామ’ షూటింగ్ ఫిబ్రవరి 22 నుండి ప్రారంభం కానుంది. ఈ మొదటి షెడ్యూల్ ను రాజమండ్రి లో చిత్రీకరించనున్నారు. ఇక ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. ముందుగా వెంకీ సరసన సీనియర్ హీరోయిన్ శ్రీయ ను తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు పాయల్ ను తీసుకున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలుబడనుంది . పక్కా కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారు.

కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు