‘వెంకీ మామ’ షూట్ లో సూపర్‌ ఎగ్జైటింగ్‌గా.. !

Published on Mar 11, 2019 9:36 am IST

యువ సామ్రాట్ నాగచైతన్య – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలె గోదావరి పరిసరాల్లోని లొకేషన్స్‌లో మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ, చైతు ల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో చైతు సరసన రాశీ ఖన్నా నటిస్తుండగా.. వెంకీకి పాయల్ రాజ్ పుత్‌ జోడిగా నటిస్తోంది. ఇప్పటికే రాశీఖన్నా ఈ సినిమా సెట్‌లో జాయిన్‌ అవ్వగా.. తాజాగా పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా జాయిన్‌ అయింది. ‘వెంకీ మామ’ షూటింగ్‌లో పాల్గొన్నాను.. సూపర్‌ ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని పేర్కొంది.

ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రంలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా ఇంట్రస్ట్ గా ఉండనుందట. అలాగే నాగ చైతన్య వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగా అలరిస్తాయని సమాచారం.

‘జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి కోన వెంకట్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More