సాహో’లో నటించట్లేదన్న హాట్ హీరోయిన్ !

Published on Jun 4, 2019 9:10 pm IST

ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం ‘సాహో’ మీద ప్రపంచవ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. దేశంలోని అన్ని పరిశ్రమల ప్రేక్షకులు సినిమా ఎప్పుడెప్పుడు రీలీజవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి వినిపించిన వార్తల్లో పాయల్ రాజ్‌పుత్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందనేది ఒక వార్త. ఈ వార్త విన్న చాలామంది ఈ అవకాశంతో పాయల్ స్టార్ తిరుగుతుందని అన్నారు.

కానీ అసలు నిజం ఏమిటంటే ఈ వార్త నిజం కాదట. సోషల్ మీడియాలో జరుగుతున్న హడావుడిని గుర్తించిన పాయల్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయట్లేదని తేల్చి చెప్పేసింది. దీంతో రూమర్లకు చెక్ పడింది. సుజీత్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శ్రద్దా కపూర్ కథానాయికగా నటిస్తుండగా పలువురు బాలీవుడ్ తారలు కీలక పాత్రలు చేస్తున్నారు. ఆగష్టు 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :

More