ఇంట్రస్టింగ్ బయోపిక్ లో సెన్సేషన్ హీరోయిన్ !

Published on Mar 2, 2019 4:41 pm IST

‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘టైగర్ నాగేశ్వర్ రావు’ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని, 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ ఇంట్రస్టింగ్ బయోపిక్ లో సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని తెలుస్తోంది. మరో రెండుమూడు రోజుల్లో పాయల్ తో అగ్రీమెంట్ కూడా చేసుకోబోతుందట చిత్రబృందం.

ఇక ‘టైగర్ నాగేశ్వర్ రావు’ పాత్రలో నటించడానికి శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారట. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను కూడా ఇప్పటికే చిత్రబృందం మొదలు పెట్టింది. ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More