సీత స్పెషల్ సాంగ్ లో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ !

Published on Jan 31, 2019 1:16 am IST

తేజ దర్శకత్వంలో యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, స్టార్ హీరోయిన్ జంటగా నటిస్తున్న చిత్రం సీత’. ప్రస్తుతం తుది దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తేజ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ టైటిల్ రోల్ నటిస్తుండగా రామ్ పాత్రలో సాయి శ్రీనివాస్ కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ నర్తించనుంది. తర్వలోనే ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నారు.

ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర నిర్మిస్తున్నఈచిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మార్చి లో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. కాగా కాజల్ , సాయి శ్రీనివాస్ జంటగా నటించడం ఇది రెండవ సారి. ఇంతకుముందు వీరిద్దరు కలిసి కవచం చిత్రంలో నటించారు. అయితే ఈచిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మరి ఈ చిత్రం తోనైనా హిట్ పెయిర్ అనుపించుకుంటారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More