‘వేశ్య’గా నటించనున్న పాయల్ !

Published on Jun 7, 2019 8:45 pm IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ బయోపిక్ లో సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ వేశ్య పాత్రలో నటిస్తోంది. మొత్తానికి పాయల్ మరో బోల్డ్ క్యారెక్టర్ లో అలరించనుంది. ఈ బయోపిక్ షూటింగ్ ఆగష్టు నుండి షూట్ మొదలుకానుందని తెలుస్తోంది.

ఇక ‘టైగర్ నాగేశ్వర్రావు’ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని, 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు. మరి అలాంటి బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More