‘ఓ మై గాడ్’ సినిమాకి పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ ?

pc-sriram
సినీ ఇండస్ట్రీలో మంచి పేరున్న అద్భుతమైన చిత్రాలను తన ప్రతిభతో అందంగా చూపించిన సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా పిసి శ్రీరామ్ పనితీరు బాగా నచ్చుతుంది, ఈ విషయాన్నీ ఆయన చాలా సార్లు చెప్పారు, అంతేకాకుండా ఆయనతో పనిచేయలనుకుంటున్నట్టుగా కూడా తెలిపాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ మరియు వెంకటేష్ లు కలిసి నటిస్తున్న హింది ‘ఓ మై గాడ్’ సినిమాకు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం లేదు. పిసి శ్రీరామ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఐ’ సినిమాకి పనిచేస్తున్నారు.

Exit mobile version