పెద్ది స్పెషల్ సెలబ్రిటీ షో.. హాజరుకానున్న సుకుమార్, ఉపాసన తదితరులు..!

పెద్ది స్పెషల్ సెలబ్రిటీ షో.. హాజరుకానున్న సుకుమార్, ఉపాసన తదితరులు..!

Published on Jun 3, 2026 7:01 PM IST

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం తర్వాత మళ్లీ ఒక పెద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఒక స్టార్ మాస్ సినిమా వస్తున్నప్పుడు థియేటర్ల వద్ద ఉండే హంగామా, పూనకాలు మరియు క్రేజ్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో చరణ్ మేనియా ప్రేక్షకులను ఊపేస్తోంది.

ఈ సినిమా హడావుడిలో భాగంగా నేడు(బుధవారం) రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని మైత్రీ విమల్ 70ఎంఎం థియేటర్‌లో గ్రాండ్‌గా సెలబ్రిటీ ప్రీమియర్ షోను ప్లాన్ చేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో ఈ ప్రీమియర్ షో సరికొత్త కలరింగ్‌తో సినీ తారల సందడిగా మారబోతోంది.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు మరియు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో మెరిశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు