నైజాంలో తెరుచుకున్న ‘పెద్ది’ బుకింగ్స్.. ఇక బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఖాయం…!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ నైజాం అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. కొద్ది నిమిషాల క్రితమే నైజాం రీజియన్‌కు సంబంధించి ‘డిస్ట్రిక్ట్’ యాప్‌లో బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన సింగిల్ స్క్రీన్స్‌లో మాత్రమే ఈ టికెట్ అమ్మకాలు మొదలయ్యాయి. గతంలో ప్రచారం జరిగినట్లుగానే, ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 టికెట్ ధర పెంపుకు అనుమతి ఇచ్చింది.

అయితే, ప్రస్తుతానికి కేవలం జూన్ 4వ తేదీ అంటే మొదటి రోజుకు సంబంధించిన బుకింగ్స్ మాత్రమే ఓపెన్ అయ్యాయి. ప్రీమియర్ షోలు మరియు మల్టీప్లెక్స్‌లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. రాబోయే కొద్ది గంటల్లోనే ఇవి కూడా లైవ్‌లోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ ధరల పెంపు వ్యవహారం ఒక కొలిక్కి రావడంతో, మేకర్స్ అనుకున్నట్లే ఇక బుకింగ్స్ ప్లాట్‌ఫామ్స్‌పై ‘పెద్ది’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, ఏఆర్ రెహమాన్ సంగీతంలో వస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Exit mobile version