మెగా 158 సెట్స్ లో ‘పెద్ది’ సర్ప్రైజ్.. బాబీ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

మెగా 158 సెట్స్ లో ‘పెద్ది’ సర్ప్రైజ్.. బాబీ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Jun 21, 2026 9:51 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ హీరోయిన్ అనస్వర రంజన్ కీలక పాత్రలో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా ఇప్పుడు భారీ స్కేల్ లో తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ 158వ సినిమాగా క్రేజీ యాక్షన్ ప్రాజెక్ట్ గా ఇప్పుడు శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇలా బిజీగా నడుస్తున్న ఈ సినిమా సెట్స్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇపుడు కనిపించడం ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గా మారింది.

అయితే సెట్స్ నుంచి దర్శకుడు కొల్లి బాబీ కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసి తను ఎంత పెద్ద స్టార్ అయినా, విలువలు, వినయం మరియు కుటుంబం పట్ల ప్రేమ మారవు. ఇది తమ సెట్స్ లో ఒక మర్చిపోలేని మెమోరీ అని బాబీ తెలిపారు. దీనితో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంట్రెస్టింగ్ గా ఈ ఫొటోస్ లో మెగాస్టార్ మిస్సవడం గమనార్హం. ఇక ఈ బిగ్ ప్రాజెక్ట్ కి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు తెలుగులో తమ మొదటి సినిమాగా నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు