మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబి సానా కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ రూరల్ రస్టిక్ డ్రామా “పెద్ది” (Peddi Movie). మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు గట్టి అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి పలు రూమర్స్ గుప్పుమన్నాయి. ఆల్రెడీ మేకర్స్ మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే బ్లాస్ట్ గా ఈ సినిమాని కన్ఫర్మ్ చేసి కూర్చుకున్నారు కానీ దీనిపై కొత్త అప్డేట్ రూపంలో ఓ క్లారిటీ అయితే వచ్చింది.
AR Rahman birthday update – రెహమాన్ అప్డేట్ తోనే పెద్ది రూమర్స్ కి చెక్
ప్లానింగ్ ప్రకారం పెద్ది (Ram Charan Peddi) షూటింగ్ ని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. అయినప్పటికీ ఈ సినిమా ఏకంగా మార్చ్ నుంచి డిసెంబర్ కి వాయిదా పడింది అంటూ పలు రూమర్స్ మొదలయ్యాయి. దీనికి కారణం రెహమాన్ కొంచెం ఎక్కువ సమయం తీసుకొని స్కోర్ అందిస్తున్నారు అంటూ ఓ వెర్షన్ వినిపించింది. కానీ లేటెస్ట్ గా రెహమాన్ బర్త్ డేకి విషెస్ చెబుతూ రిలీజ్ చేసిన పోస్టర్ అప్డేట్ లోనే ఈ సినిమా ఆన్ టైం మార్చ్ 27నే వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో ఆ రూమర్స్ కి ఇది చెక్ మేట్ అనుకోవచ్చు.
మున్ముందు మరింత క్లారిటీ
గతంలో కూడా పలు సినిమాలు రిలీజ్ వాయిదా రూమర్స్ ముందు మేకర్స్ ఇలా అప్డేట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ చివరి నిమిషంలో వాయిదాలు పడ్డాయి. మరి ఆ ఫార్మాట్ లో కాకుండా పెద్ది అభిమానులకి స్పెషల్ డేన వస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి. సో నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ కోసం వేచి చూడాలి.
Team #Peddi wishes the 'Isai Puyal' @arrahman sir a very Happy Birthday ❤????#Peddi's album will be one of the best in his illustrious career ✨????#ChikiriChikiri is just the beginning, wait for his magic in the next single ????
#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.… pic.twitter.com/pKgsJWM9YT
— Vriddhi Cinemas (@vriddhicinemas) January 6, 2026


