గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా తదుపరి షెడ్యూల్ లో చరణ్ – జాన్వీ కపూర్ లపై ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు. అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ వేస్తున్నారట. ఈ సాంగ్ లో చరణ్ స్టెప్స్ తో పాటు జాన్వీ కపూర్ గ్లామర్ కూడా హైలైట్ గా ఉంటుందట.
కాగా, ఇప్పటి వరకూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందని టాక్. మొత్తానికి బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్నమైందట. అన్నట్టు ‘పెద్ది’ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి పెద్ది సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.


