‘పెద్ది’ ట్రైలర్ టేకోవర్.. ప్రోమో కట్ అదిరిందిగా!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పెద్ది”. క్రికెట్, కుస్తీ ఇంకా ఇతర క్రీడా నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ సినిమా కంటెంట్ పట్ల అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. పైగా టాలీవుడ్ నుంచి మిస్ అవుతున్న భారీ పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు మరింత పీక్ లో ఉన్నాయి.

అయితే ఈ చిత్రం గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ని మేకర్స్ ముంబైలో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ పై లేటెస్ట్ గా వదిలిన ప్రోమో కట్ మాత్రం అదిరింది అని చెప్పాలి. పెద్ది గాడు ఇక్కడ కొడితే బాల్ ముంబైలో పడింది. అలా ఈ మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్ తో పెద్ది గాడు టేకోవర్ చేస్తున్నట్టు తెలిపారు.

అంతే కాకుండా ప్రోమో లాస్ట్ షాట్ గా రామ్ చరణ్ కుస్తీ ఫైట్ సీక్వెన్స్ నుంచి కొత్త విజువల్ అదిరింది. దీనితో మొత్తానికి ఫ్యాన్స్ లో నశిస్తున్న కోరికలు మళ్ళీ మేకర్స్ రేకెత్తించగలిగారు. ఇదే మూమెంటంని కొనసాగిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తారో లేదో చూడాలి మరి.

Exit mobile version