పేట ట్రైలర్ విడుదల !

Published on Jan 2, 2019 11:25 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘పేట’ యొక్క తెలుగు ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. ఇక ఈ ట్రైలర్ మొత్తం రజినీ ఇమేజ్ కు తగ్గట్లుగా కట్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే రజినీ స్టైలిష్ మేనరిజం ను ఈ చిత్రంలో పూర్తిగా చూపించబోతున్నారని తెలుస్తుంది.

యాక్షన్ సన్నివేశాలతో ,రజినీ మార్క్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకొనేలా ఉండడంతో ఈ చిత్రం సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీనిచ్చేలా వుంది. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం లో సిమ్రాన్ , త్రిష , విజయ్ సేతుపతి , నవాజుద్దిన్ సిద్దిఖీ,శశి కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని అశోక్ వల్లభనేని విడుదలచేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ఈ నెల 10న విడుదలకానుంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More