విడుదలైన “పెళ్లి సందD” టైటిల్ సాంగ్

విడుదలైన “పెళ్లి సందD” టైటిల్ సాంగ్

Published on Aug 12, 2021 4:24 PM IST

రోషన్ మరియు శ్రీ లీలా హీరో హీరోయిన్ లుగా గౌరీ రోనంకి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పెళ్లి సందD. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీ రాఘవేంద్ర రావు గారు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కృష్ణ మోహన్ రావు సమర్పణ లో ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ పతాకాల పై మాధవి కోవెల మూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా టైటిల్ సాంగ్ విడుదల అయ్యింది. ఈ పాట కి శివశక్తి దత్త మరియు చంద్రబోస్ లు లిరిక్స్ రాయగా, హేమ చంద్ర, రమ్య బెహరా, దీపు లు కలిసి పాడారు. విడుదల అయిన కొద్ది సేపటికే ఈ లిరికల్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు