‘పెళ్లి చూపులు’ చిత్రంతో నిర్మాతగా భారీ విజయం సాధించారు రాజ్ కందుకూరి. ఇప్పుడు ఆయన తనయుడు శివ కందుకూరి కూడా హీరోగా పరిచయం అవ్వబోతున్నారు. ఇప్పటికే రాజ్ కందుకూరి తన తనయుడి కోసం ఓ స్క్రిప్ట్ ను కూడా లాక్ చేశారని తెలుస్తోంది. ఆ స్క్రిప్ట్ కు ఒక ఎస్టాబ్లిష్ డైరెక్టర్ అయితే పూర్తి న్యాయం జరుగుతుందని రాజ్ కందుకూరి భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడ్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.
కాగా శివ కందుకూరి గతంలోనే హీరోగా నటించనున్నారని, అతని సరసన హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ హీరోయిన్ గా చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ చిత్రం పట్టాలెక్కలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి శివ కందుకూరిని హీరోగా పరిచయం చెయ్యడానికి రాజ్ కందుకూరి సన్నాహాలు చేస్తున్నారు.


