అందాల తార రష్మిక ‘పుష్ప 2’, ‘కుబేర’ చిత్రాలతో వరుస విజయాలందుకొని జోరుమీద ఉంది. ప్రస్తుతం మహిళా ప్రాధాన్య కథలతో రష్మిక బిజీగా ఉంది. ఐతే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన కెరీర్ గురించి, అలాగే తన ఎమోషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ, రష్మిక ఏం మాట్లాడింది అంటే.. ‘నేను ఒక నటిని. నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నేను ఇంట్లో ఎలా ఉంటానో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా ఎమోషనల్ పర్సన్‌ని నేను. కానీ, నేను నా భావోద్వేగాలను బయటికి చూపించను’ అంటూ రష్మిక తెలిపింది.
రష్మిక ఇంకా మాట్లాడుతూ.. ‘నేను నా భావోద్వేగాలను ఎందుకు చూపించను అంటే ? అభిమానులు నా దయా గుణాన్ని నా బలహీనత అనుకుంటారు. లేకపోతే నేను కెమెరాల కోసమే ఇదంతా చేస్తున్నా అనుకుంటారు. మనం ఎంత నిజాయతీగా ఉంటే.. అంత వ్యతిరేకత మనపై వస్తుంది. అందుకే, నేను ఎక్కువగా నా ఎమోషన్స్ ను బయటకు చూపించను. దీంతో పాటు నా చుట్టూ ఉండే నెగిటివిటీతో ప్రభావితం కాకుండా ఉండటానికి కూడా నేను చాలా కష్టపడుతును’ అని రష్మిక చెప్పుకొచ్చింది.


