సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్న సూపర్ స్టార్ !

Published on Dec 19, 2018 8:50 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 165 వచిత్రం ‘పెట్టా’ సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. పండుగకు తెలుగులో ఎన్టీఆర్ ‘కథానాయకుడు , ఎఫ్ 2, వినయ విధేయ రామ’ వంటి భారీ చిత్రాలు విడుదలవుతుండంతో పెట్టాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దొరకడం కష్టమని వాయిదా వేశారట. అయితే ఈ చిత్రం తమిళంలో మాత్రం అనుకున్న సమయానికే విడుదలకానుంది. ఈచిత్రం యొక్క తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు. మరి ఈచిత్రాన్ని తెలుగులో ఎప్పుడు విడుదలచేస్తారోచూడాలి.

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ , త్రిష , విజయ్ సేతుపతి , నవాజుద్దిన్ సిద్దిఖీ, బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో రజినీ డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :