‘పేట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్ డేట్ !

Published on Jan 5, 2019 1:28 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం ‘పేట’. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్య క్రమాలను కూడా పూర్తి చేసుకుంది.ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా జనవరి 10న ‘U/A’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రేపు సాయంత్రం 7 గంటలకు ఈ ఈవెంట్ హైదరాబాద్ లోని సైబర్ కన్వెన్షన్ లో జరుగనుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకకు రజినీతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :