సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేట’ చిత్రం యొక్క ట్రైలర్ విడుదలతేదీని ఖరారు చేశారు చిత్ర బృందం. ఈనెల 28న ఈ ట్రైలర్ ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. జిగర్తండా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నవాజుద్దిన్ సిద్దిఖీ , విజయ్ సేతుపతి , బాబీ సింహ, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు.
అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10 న తమిళ , కన్నడ భాషల్లో విడుదలకానుంది. అయితే ఈ చిత్రం తెలుగులో ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సి వుంది.


