పెట్టా ట్రైలర్ విడుదలకు టైం ఫిక్స్ !

Published on Dec 27, 2018 12:30 pm IST


సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పెట్టా’ చిత్రం యొక్క ట్రైలర్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదలచేయనున్నారు. ఈ ట్రైలర్ ఫై తలైవా అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో రజినీ డిఫ్రెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు.

అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సిమ్రాన్ , త్రిష , విజయ్ సేతుపతి , నవాజుద్దిన్ సిద్దిఖీ ముఖ్య పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కు ప్రేక్షకులముందుకు రానుంది. ఇక తెలుగులో ఈ చిత్రం ‘పేట’ పేరుతో సంక్రాంతికి విడుదలవుతుంది. అదే సమయానికి టాలీవుడ్లో బడా చిత్రాలు కూడా విడుదలవుతుండడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వాటికీ ఎంత పోటీనిస్తుందనేదే ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :