ఆ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలకానున్నాయా ?

Published on Dec 26, 2018 11:18 am IST

కోలీవుడ్ లో పొంగల్ కు రెండు బఢా చిత్రాలు విడుదలకానున్నాయి. అందులో సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘పేట’ ఒకటికాగా తల అజిత్ నటించిన ‘విశ్వాసం’ రెండవది. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ‘పేట’ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మాస్ ఎంటర్టైనెర్ గా రానున్న ఈ చిత్రంలో రజినీ స్టైలిష్ మేక్ ఓవర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. రజినీ నటించిన ‘లింగ , కబాలి , కాలా’ చిత్రాలు పరాజయం చెందండంతో నిరాశలో వున్నా ఆయన అభిమానులకు పేట మంచి ట్రీట్ ఇవ్వనుందని సమాచారం. దర్శకుడు ఫామ్ లో ఉండండం అలాగే భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కడంతో ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈచిత్రం జనవరి 10న విడుదలకానుంది.

ఇక శివ దర్శకత్వంలో అజిత్ నటించిన యాక్షన్ ఎంటర్టైనెర్ ‘విశ్వాసం’ ఫై కూడా తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఈచిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. అయితే ఈ చిత్రాన్ని కూడా జనవరి 10న విడుదలచేయనున్నారని సమాచారం. మరి ఈ వార్తలు నిజమైతే ఒకే రోజు రెండు పెద్ద సినిమాల్తో తమిళ ప్రేక్షకులు పండగ చేసుకోనున్నారు. ఇక ఇదిలావుంటే ఈ రెండు చిత్రాలు తెలుగు లో అదే డేట్ కి రిలీజ్ అవుతాయో లేవో ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.

సంబంధిత సమాచారం :