ఫోటో మూమెంట్ : తనతోనే తాను ‘తగ్గేదేలే’.. పుష్ప లిరిక్స్ గుర్తు చేసిన బన్నీ

ఫోటో మూమెంట్ : తనతోనే తాను ‘తగ్గేదేలే’.. పుష్ప లిరిక్స్ గుర్తు చేసిన బన్నీ

Published on Mar 29, 2024 6:48 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ పై ఎలాంటి అంచనాలు ఉంటాయో తెలిసిందే. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప” ఎన్నో సంచలనాలు నమోదు చేసింది. మరి ఈ చిత్రం తర్వాత బన్నీ క్రేజ్ కూడా మారిపోగా లేటెస్ట్ గా దుబాయ్ లో తన మైనపు విగ్రహాన్ని తాను లాంచ్ చేసే అరుదైన ఫీట్ ని తాను అందుకున్నాడు. అయితే అల్లు అర్జున్ షేర్ చేసిన పవర్ఫుల్ పిక్ మంచి ఫోటో మూమెంట్ లా మారింది. తన విగ్రహం తాను ఇద్దరూ పుష్ప లోని తగ్గేదేలే సిగ్నేచర్ మూమెంట్ చేస్తూ దర్శనమిచ్చారు.

మరి ఈ పిక్ చూస్తే పుష్ప లోని ఆస్కార్ విన్నింగ్ రచయిత చంద్రబోస్ రాసిన ఏయ్ బిడ్డ సాంగ్ లో లిరిక్స్ గుర్తు రాక మానవు. నన్నైతే కొట్టేటోడు భూమ్మీదే పుట్టలేదు, ఒకవేళ పుడితే అది కూడా నేనే అన్నట్టు తనకి తానే పోటీ అనే రేంజ్ లో ఉంటుంది. మరి బన్నీ షేర్ చేసిన ఈ పిక్ చూస్తే తనకి ట్విన్ బ్రదర్ గా అవే పదాలు గుర్తొస్తున్నాయి. మరి మొత్తానికి అయితే బన్నీ ఫ్యాన్స్ ఈ మూమెంట్ చూసి ఆనంద పడుతున్నారు. ఇక ఈ సాలిడ్ ఫీట్ తర్వాత అవైటెడ్ చిత్రం “పుష్ప 2” అప్డేట్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు