ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది(Peddi) కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ చార్ట్ బస్టర్ అయ్యింది. ఇక ఈ సాంగ్ తర్వాత నెక్స్ట్ అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా ఈ పండుగకి తన పెద్ది తో కలిసి బుచ్చిబాబు దిగిన డివోషనల్ పిక్ ని షేర్ చేసుకున్నాడు.
దీనితో ఈ పిక్ మంచి ఫోటో మూమెంట్ గా మారింది. మరి ఇందులో ఇద్దరు స్టార్స్ కూడా దేవుని చిత్ర పటాల మధ్యలో కనిపిస్తుండగా రామ్ చరణ్ మంచి డైనమిక్ లుక్ లో ఉన్నాడు. మరి ఈ కొత్త పిక్ తో అభిమానులు సినిమా కోసం మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మార్చ్ 27న గ్రాండ్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ కి తీసుకొస్తున్నారు.


