ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్ 111వ సినిమా కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో అనౌన్స్ అయ్యి ఇటీవల వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తో సాలిడ్ రెస్పాన్స్ ని కూడా అందుకుంది. ఇక లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని తమ హీరోయిన్ గా అనౌన్స్ చేస్తూ ఆమెకి ఓ పవర్ఫుల్ రోల్ ని ఇచ్చినట్టు కన్ఫర్మ్ చేశారు.
అయితే నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ పోస్టర్ రివీల్ చేయగా లేటెస్ట్ గా మేకర్స్ సినిమా సెట్స్ లోనే కాజల్ పుట్టినరోజు వేడుకలు చేసిన ఫొటోస్ షేర్ చేసారు. మరి వీటిలో బాలయ్య స్వాగ్, కాజల్ లవ్ ఎమోజీతో స్టైలిష్ గా కనిపించిన పిక్ మరింత అట్రాక్ట్ గా మారింది. దీనితో ఫ్యాన్స్ లో మరింత క్రేజీగా మారింది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.


