ఫోటో మూమెంట్ : స్వాతంత్య్ర యోధులుగా అల్లు వారి పిల్లలు.!

Published on Aug 15, 2020 1:45 pm IST

నేడు 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎంతో మంది అగ్ర సినీ తారలు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇలా వచ్చే అకేషన్స్ కు కానీ ఇతర సందర్భాలలో కానీ అల్లు వారి పిల్లలు మాత్రం ప్రత్యేకమైన గెటప్స్ లో దర్శనమిస్తారు. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ వారిని చూడచక్కగా తయారు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అల్లు అర్హ మరియు అల్లు అయాన్ లను సమరయోధులుగా రెడీ చేసారు.

మొదటగా భారత్ కు స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన మదన్ మోహన్ మాళవియా గా అర్హను రెడీ చేసారు. ఈ కాస్ట్యూమ్ లో అర్హ చాలా క్యూట్ గా కనిపించి ఆకట్టుకుంది. అలాగే అల్లు అయాన్ అయితే మొట్ట మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డిగా తయారు అయ్యి ఏకంగా సైరా లో మెగాస్టార్ ను తలపించాడు. ఇలా వీరిద్దరూ చూడ చక్కగా స్వాతంత్య్ర సమరయోధులులా కనిపించి ఈ రోజున బన్నీ అభిమానులకు ఆనందం కలిగించారు.

సంబంధిత సమాచారం :

More