ఫోటో మూమెంట్ : అల్లు రామలింగయ్య దీవెనలందుకుంటున్న మెగాస్టార్.!

chiru allu ramalingam
ఈరోజు మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ లెజెండరీ నటులు అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి కావడంతో అల్లు వారి కుటుంబం ఆయన్ను మరోసారి స్మరించుకున్నారు. అయితే అల్లు వారి అల్లుడు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా తన మామ అల్లు రామలింగయ్య తో ఎలాంటి అనుబంధం ఉండేదో ఒక అరుదైన ఫోటోను పెట్టి దాని ద్వారా పంచుకున్నారు.

బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫోటో తన వివాహ వేడుకలో అల్లు రామలింగయ్య గారి దగ్గర దీవెనలు అందుకుంటూ చిరు కనిపిస్తున్నారు. ఈ ఫోటోను చిరు తన సోషల్ మీడియా ద్వారా పంచుకొని ఆయన 99వ జన్మదినం సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటున్నాని, ఆయన నాకు మామ కంటే ఎక్కువ అని ఒక గొప్ప నటులు, వైద్యులు, స్వాతంత్ర పోరాట యోధులు, అలాగే ఒక ఫిలాసఫర్ అన్నిటికి మించి తనకు ఆయన గొప్ప గురువు అని వ్యాఖ్యానించారు. అలాగే ఇంకో ఏడాది తర్వాత ఆయన నూరవ జయంతి ఒక ల్యాండ్ మార్క్ లా నిలుస్తుంది అని ఆయనపై ప్రేమతో తెలిపారు.

Exit mobile version