ఫోటోమూమెంట్ : తన ఖరీదైన వాహనం ముందు అందాల భామ!

ఫోటోమూమెంట్ : తన ఖరీదైన వాహనం ముందు అందాల భామ!

Published on Jun 3, 2015 7:19 AM IST

Shruti-Haasan

ప్రముఖ నటి శృతి హాసన్ తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో ఒకరరుగా చలామణి అవుతున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న బడా బడా సినిమాలన్నీ విడుదలకు సిద్ధమవ్వడంతో పాటు ఈమధ్యే విడుదలై మంచి విజయం సాధించిన ‘గబ్బర్’ ఆమెకు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చిపెట్టింది. మహేష్ సరసన ఆమె నటించిన క్రేజీ సినిమా శ్రీమంతుడు జూలై నెలలో విడుదల కానున్న విషయం తెలిసిందే!

ఇక వరుస సినిమాలతో బిజీబిజీగా మారిపోయిన శృతి, తనకు తానే ఓ ఖరీదైన, విలాసవంతమైన ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇచ్చుకుంది. రేంజ్ రోవర్ కంపనీకి చెందిన ఖరీదైన వాహనంతో ఇలా ఫోటోలకు పోజులిచ్చింది. అందమైన తన వాహనం ముందు అంతే అందంగా నవ్వుతూ నిలబడి ఫోటోకు అందాన్ని తెచ్చిపెట్టింది కదూ.. ఈ అందాల భామ!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు