ఫోటో మూమెంట్ : సూపర్ స్టార్‌తో లిటిల్ పవర్ స్టార్!

ఫోటో మూమెంట్ : సూపర్ స్టార్‌తో లిటిల్ పవర్ స్టార్!

Published on Aug 5, 2015 7:47 PM IST

mahesh-with-akhir
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్న స్టార్ హీరోల గురించి చెప్పుకుంటే మొదటగా వినిపించేది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్లే! ఎవరికి వారే తమ తమ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ఇద్దరూ స్టార్లుగా వెలుగొందుతున్నవారే! ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. మహేష్, పవన్‌లిద్దరూ ఎక్కడా పెద్దగా కలిసి కనపడకపోయినా వారిద్దరూ మంచి మిత్రలు కూడా కావడం. మహేష్, పవన్‌లు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ఎప్పుడో పుష్కరానికొకటిగానీ సాధ్యపడలేదు.

అదలా ఉంచితే ఈ ఇద్దరూ కలిసి ఉండే లేటెస్ట్ ఫోటో ఒకటి ఇప్పుడు కనిపించకపోయినా, ఆ లోటు తీర్చేలా పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్, సూపర్ స్టార్ మహేష్‌తో కలిసి దిగిన ఓ ఫోటో మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తోన్న విషయం. ఈమధ్యే లిటిల్ పవర్ స్టార్ అకిరా, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో మహేష్‌ను అనుకోకుండా కలిసినప్పుడు దిగిన ఫోటో ఇది. ఒకరు సూపర్ స్టార్, ఇంకొకరు సూపర్ స్టార్ కుమారుడు.. ఇద్దరూ కలిసి ఫోటోకే ఓ అందాన్ని తెచ్చారు కదూ!?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు