ఫోటో మూమెంట్..సతీ సమేతంగా రక్తదానం చేస్తున్న మెగాస్టార్.!

Published on Jun 14, 2021 5:02 pm IST

మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి జీవితం ఒక తెరచిన పుస్తకం.. కొన్ని దశాబ్దాలు నెంబర్ 1 స్థానంలో కొనసాగిన చిరు అలాగే మన టాలీవుడ్ నుంచి సాయం అందివ్వడానికి కూడా ఎప్పుడు తానే ముందు ముందుకు వస్తారు. అలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సమాజానికి కూడా అపారమైన సేవను అందించారు.

అలా మొట్ట మొదటి సారిగా రక్తదానం తాలూకా ప్రాధాన్యతను తెలియజేసి బ్లడ్ బ్యాంకునే స్థాపించి ఎందరో ప్రాణాలను కాపాడిన మెగాస్టార్ చిరంజీవి ఈరోజు “ప్రపంచ రక్తదాతల దినోత్సవం” సందర్భంగా మెగాస్టార్ ఓ అపురూపమైన ఫోటోను షేర్ చేసి రక్త దాతలు అందరికీ దయవాదాలు తెలియజేసారు.

తాను తన భార్య సురేఖ గారు కలసి రక్తదానం చేస్తున్న ఫోటో పెట్టి స్పెషల్ గా బ్లడ్ బ్రదర్స్ మరియు సిస్టర్స్ కు థాంక్స్ చెప్పారు. రక్తదానం అనేది విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఉన్న ఒక గొప్ప మార్గం అని తెలిపి ప్రతి ఒకరు రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు..

సంబంధిత సమాచారం :