పిక్ టాక్: క్లిం కారాతో తమ్ముళ్లు.. బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన ఉపాసన

పిక్ టాక్: క్లిం కారాతో తమ్ముళ్లు.. బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన ఉపాసన

Published on Jun 14, 2026 8:24 PM IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి బ్యూటిఫుల్ స్టార్ జంటల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఉపాసన కొణిదెల జంట కూడా ఒకరు. ఇన్నేళ్ల దాంపత్య జీవితంలో ఎంతో అన్యోన్యంగా గడిపిన వీరు తమ ఫాలోవర్స్ కి ఒక ప్రేరణ గా నిలిచారు. అయితే వీరికి మొదటి వారసురాలుగా క్లిన్ కారా మొదట జన్మించిన తర్వాత మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇక ఆ తర్వాత డబుల్ ట్రీట్ అన్నట్టు ఇద్దరు బాబులు కవలలుగా జన్మించారు.

దీనితో మెగా లెగసి ముందుకు తీసుకెళ్లేందుకు ఇద్దరు వచ్చారని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేసారు. అయితే ఈ ముగ్గురుని కలిపి చరణ్ కానీ ఉపాసన కానీ చూపించింది లేదు. అయితే తాజాగా ఉపాసన ముగ్గురు బుజ్జాయిల చేతులు మాత్రం కలిపి చూపిస్తూ షేర్ చేసిన పిక్ ఇప్పుడు అభిమానుల్లో ఆనందం నింపింది. ఇక చరణ్ లేటెస్ట్ గా పెద్ది సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ అందుకోగా ఇపుడు ఉపాసన షేర్ చేసిన పిక్ ఫ్యాన్స్ కి బోనస్ ట్రీట్ అని చెప్పొచ్చు.

తాజా వార్తలు