అన్నా లెజ్నేవా కాదు.. అన్నా కొణిదెల: పేరు మార్పుపై క్లారిటీ ఇస్తూ పవన్ కళ్యాణ్ సతిమణి అన్నా భావోద్వేగ సందేశం!

అన్నా లెజ్నేవా కాదు.. అన్నా కొణిదెల: పేరు మార్పుపై క్లారిటీ ఇస్తూ పవన్ కళ్యాణ్ సతిమణి అన్నా భావోద్వేగ సందేశం!

Published on Jul 27, 2026 6:30 PM IST

​తన పేరు, ఇంటిపేరుకు సంబంధించి వస్తున్న వార్తలపై జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతిమణి అన్నా కొణిదెల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ అంశంపై నెటిజన్లతో, అభిమానులతో మాట్లాడటానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

​ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ప్రారంభించినప్పటి నుంచీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని అనుకున్నానని, అయితే సరైన రీతిలో ఎలా చెప్పాలో తెలియక కొంత సమయం తీసుకున్నానని అన్నా తెలిపారు. వివాహ వార్తలు ప్రచారంలోకి వచ్చిన సమయంలో తన పేరును ‘అన్నా లెజ్నేవా’గా పేర్కొన్నారని, అయితే తమ పెళ్లి రిజిస్ట్రేషన్ పత్రమే ఆ ఇంటిపేరుతో ఉన్న చివరి అధికారిక డాక్యుమెంట్ అని ఆమె వెల్లడించారు.

​లగ్నం జరిగిన రోజే భర్త ఇంటిపేరును స్వీకరించి ‘అన్నా కొణిదెల’గా మారానని ఆమె స్పష్టం చేశారు. “నన్ను అందరూ ‘అన్నా కొణిదెల’ అని మాత్రమే పిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ పేరే నాకు పరిపూర్ణమైన సంతృప్తిని ఇస్తుంది. నా అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని ఆమె ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

​ఇదే సందర్భంలో, తాము మొదటిసారి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ప్రయాణించిన సమయంలో తీసుకున్న ఒక ప్రత్యేకమైన ఫొటోను కూడా అన్నా కొణిదెల నెటిజన్లతో పంచుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు