బాలీవుడ్లో బడా ఆఫర్స్ పట్టేసిన పూజా హెగ్డే.

Published on Jun 24, 2019 10:16 am IST

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చూస్తూ విజయపథంలో దూసుకుపోతుంది. తెలుగులో ఆమె ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీతో పాటు ,వరుణ్ తేజ్ “వాల్మీకి” మూవీలో నటిస్తుండగా అఖిల్ ,బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలో కూడా పూజా అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఐతే బాలీవుడ్లో మరో రెండు పెద్ద చిత్రాలలో నటించే అవకాశం దక్కించుకుంది పూజా. వరుణ్ ధావన్ హీరోగా రానున్న “కూలీ నెంబర్ వన్” మూవీతో పాటు సైఫ్ అలీ ఖాన్,టబు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న “జవానీ జానెమన్” చిత్రంలో హీరోయిన్ గా పూజా నటించనుంది. గతంలో హృతిక్ హీరోగా తెరకెక్కిన “మొహంజదారో” అనే భారీ పీరియాడిక్ మూవీలో పూజా హీరోయిన్ గా చేసింది. కానీ ఆ మూవీ అనూహ్యంగా పరాజయం పొందడంతో ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. మళ్ళీ ఇప్ప్డుడు బాలీవుడ్లో అవకాశం రావడంతో పూజా తెగ సంబరపడిపోతుందట.

సంబంధిత సమాచారం :

More