‘టెంపర్’ సినిమా వివాదంలో బండ్ల గణేశ్‌పై కేసు నమోదు

Published on Oct 5, 2019 11:16 am IST

ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘టెంపర్’ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బండ్ల గణేశ్ నిర్మాత. ఈ సినిమా నిర్మాణం కోసం బండ్ల సినీ నిర్మాత, ఫైనాన్షియర్ పివిపి వద్ద డబ్బు ఫైనాన్స్ తీసుకున్నారు. విడుదల సమయంలో కొంత మొత్తం చెల్లించిన బండ్ల ఇంకొంత పెండింగ్ పెట్టారట.

దీంతో పివిపి బండ్లను మిగతా మొత్తం చెల్లించాలని కోరినట్టు, వ్యవహారం కాస్త ముదిరి వివాదంగా మారినట్టు తెలుస్తోంది. దీంతో పివిపి శుక్రవారం రాత్రి పోలీసులకు పిర్యాధు చేశారు. పిర్యాధు అందుకున్న పోలీసులు బండ్ల గణేశ్, ఆయన అనుచరుల మీద సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు యొక్క ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్న బండ్ల నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వడానికి కూడా సన్నద్దమవుతున్నారు.

సంబంధిత సమాచారం :

More