‘పొలిమేర 3’ అఫీషియల్ లాంచ్.. అర్జున్ సర్జా ఎంట్రీతో భారీ అంచనాలు!

‘పొలిమేర 3’ అఫీషియల్ లాంచ్.. అర్జున్ సర్జా ఎంట్రీతో భారీ అంచనాలు!

Published on Jul 27, 2026 10:01 PM IST

ఓటీటీలో ‘మా ఊరి పొలిమేర’తో సంచలనం సృష్టించి, థియేటర్లలో ‘పొలిమేర 2’తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ ఇప్పుడు ‘పొలిమేర 3’ని మరింత పవర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్లపై వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్ తొలి క్లాప్ కొట్టగా, డి.సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు బన్నీవాస్, సదానంద్ గౌడ్‌లు చిత్ర బృందానికి బౌండెడ్ స్క్రిప్ట్‌ను అందించి విషెస్ తెలిపారు. నారాయణదాస్ నారంగ్ జయంతి సందర్భంగా ఈ మూవీ ఓపెనింగ్ జరగడం విశేషం.

ఈ పార్ట్ 3లో అతిపెద్ద ఆకర్షణగా ‘యాక్షన్ కింగ్’ అర్జున్ సర్జా ‘పొలిమేర’ వరల్డ్‌లోకి అడుగుపెట్టడం నిలిచింది. సౌత్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న అర్జున్ ఈ ఫ్రాంచైజీలో ఒక కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. అర్జున్ రాకతో ఈ సినిమాపై పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈసారి మరింత లోతైన రహస్యాలు, భయానక అంశాలు మరియు ఊహించని ట్విస్టులతో కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ చిత్రంలో సత్యం రాజేష్ మరోసారి కొమరయ్య పాత్రలో నటిస్తుండగా.. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా వార్తలు