వెంకీమామలో పొలిటికల్ టచ్ !

Published on Apr 17, 2019 12:20 pm IST

విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్ నాగ చైతన్యల మల్టీ స్టారర్ వెంకీమామ ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో 100 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటుండగా వెంకీ ,చైతూ లపై పొలిటికల్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఇంట్రస్టింగ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్ సినిమాకు కీలకం కానుందట. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పాయల్ రాజ్ పుత్ , రాశి ఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. జూలై లో షూటింగ్ ను పూర్తి చేసి చిత్రాన్ని దసరా కు విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :