లేటెస్ట్..ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “PS2”..కానీ.!

Published on May 26, 2023 8:00 am IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ఫ్రాంచైజ్ “బాహుబలి” స్ఫూర్తి తో కోలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన భారీ హిస్టారికల్ చిత్రం “పొన్నియిన్ సెల్వన్”. లెజెండరీ దర్శకుడు మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన ఈ చిత్రంలో అయితే విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, త్రిష లాంటి భారీ తారాగణంతో అయితే తెరకెక్కింది.

మరి పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ కాగా పార్ట్ 2 పై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ గా పార్ట్ 1 కంటే పార్ట్ 2 కి మంచి టాక్ వచ్చినప్పటికీ మొదటి భాగంలో సగం వసూళ్లతో రెండో భాగం నిలిచిపోవడం గమనార్హం. ఇక థియేటర్స్ లో కూడా ఆల్ మోస్ట్ తేలిపోయిన ఈ సినిమా రన్ ఇప్పుడు అయితే ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఈ సినిమా ఇప్పుడు నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. కానీ..ప్రస్తుతం మాత్రం అన్ని భాషల్లో రెంటల్ గా మాత్రమే అందుబాటులో ఉంది. పైగా దాదాపు 400 పెట్టి ఈ సినిమా కొని చూడాలి. మరి ఇంత మొత్తం పెట్టి వీక్షకులు ఓటిటి లో అయినా ఆదరిస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :