సెట్స్ లో ప్రభాస్ బిహేవియర్ పై ఆసక్తి వ్యాఖ్యలు చేసిన పూజ

Published on Apr 2, 2020 9:01 am IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటుంది పూజ హెగ్డే. ఆమె టాలీవుడ్ లో రెండు చిత్రాలలో నటిస్తుంది. అందులో ఒకటి అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. అలాగే ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామాలో కూడా పూజ హెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. ఇక కరోనా వైరస్ కారణంగా అన్ని చిత్రాల షూటింగ్స్ కి బ్రేక్ పడడంతో పూజ విరామంలో ఉన్నారు. దీనితో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

కాగా సెట్స్ ప్రభాస్ ఎలా ఉంటారు అని ఆమెను అడుగగా పూజ ఆసక్తికర సమాధానం చెప్పారు. ప్రభాస్ చాల సరదా మనిషి, సెట్స్ లో నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. అలాగే ఎదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయనతో పనిచేయడం చాల ఆనందంగా ఉంటుంది అని పూజ చెప్పుకొచ్చింది. ఇక ఈ పీరియాడిక్ మూవీలో ప్రభాస్ తో తన కెమిస్ట్రీ చాల బాగా ఉంటుందని పూజ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

X
More